← Back to news

సంజీవయ్య నగర్‌లో వీధికుక్కల భయం

By Gopichand· 1d ago· Guntur

గుంటూరు సంజీవయ్య నగర్ 1వ లైన్‌లో వీధికుక్కలు పెరిగిపోవడంతో జనం భయపడుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి కుక్కలను తెచ్చి మున్సిపల్ వ్యాన్లలో తమ ఏరియాలో వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ రోజు కూడా అలాగే కుక్కలను వదిలేస్తుంటే నిలదీసేలోపే మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. కుక్కలు రాత్రిపూట మొరుగుతూ, వీధుల్లో ఆడుకునే చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు.

More in Local