బాలల రక్షణపై మహిళలకు అవగాహన

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో మహిళా సమైక్య సభ్యులకు బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మిషన్ వాత్సల్య చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలల రక్షణ, బాల కార్మికుల నిర్మూలన, పిల్లల దత్తత ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది నజీరా, శిరీష మాట్లాడుతూ.. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే 1098, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


