నాసిరకం స్క్రీన్‌గార్డులకు చెక్!

నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడటం అందరికీ చాలా సాధారణమైన విషయం. మొబైల్ జారి కిందపడితే స్క్రీన్ పగిలిపోతుందనే భయంతో చాలామంది ఖరీదైన స్క్రీన్‌గార్డులు వాడుతుంటారు. ఇకపై వాటి నాణ్యతపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు BIS మార్క్ తప్పనిసరి కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ప్ అమల్లోకి వస్తాయి. తయారీదారులు 2027 మార్చి 31లోపు BIS రూల్స్‌కి అనుగుణంగా మారాలి.


