ఛలో విజయవాడతో హై టెన్షన్
AP: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 27న వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో నిరసన చేశారు. రెండు నోషనల్ ఇన్‌క్రిమెంట్లు, పెండింగ్ జీతాలు, ప్రమోషన్లపై స్పష్టమైన విధానం కావాలని డిమాండ్ చేశారు. అయితే నిరసనకు పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చౌక్ దగ్గర రోజంతా ఉద్రిక్తత, తోపులాట పరిస్థితులు తలెత్తాయి. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా వెనక్కి తగ్గని ఉద్యోగులు.. రాత్రి కూడా నిరసన తెలిపారు.


