AP పెన్షన్ల పంపిణీలో మార్పులు

APలో 62 లక్షల మందికి ప్రతి నెలా ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తున్నారు. వీరిలో 9లక్షల 34వేల మంది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ - NSAP కింద ఉన్నారు. కేంద్రం వీరికి ఏటా 382 కోట్లకు పైగా కేటాయిస్తోంది. అక్టోబర్ 1 నుంచి కేంద్ర వాటా 200 నుంచి 500 రూపాయల వరకు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది. మిగతా రాష్ట్ర వాటాని సచివాలయ ఉద్యోగులు చేతికి ఇస్తారు. మొత్తం పెన్షన్‌లో ఏ తగ్గింపూ లేదు. వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000 అందుతాయి.

