ప్రకృతి అందాలకు టూరిజం టచ్
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం ఒంబి గ్రామ సమీపంలోని కంకడ కత్రు గెడ్డను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. ఆయన ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు కొండల మధ్య జిప్లైన్ ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని చెప్పారు. పైనరీకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉండటంతో అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.



