← Back to news

సునీల్ కంటే ముందు ఆ క్యారెక్టర్ నాదే : శివాజీ

By BK· 7h ago
సునీల్ కంటే ముందు ఆ క్యారెక్టర్ నాదే : శివాజీ

'తెల్ల కాగితం' సినిమా ప్రమోషన్స్‌లో యాక్టర్ శివాజీ ఆసక్తికరమైన విషయం చెప్పారు. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలో పాపులర్ అయిన 'మంగళం శ్రీను' క్యారెక్టర్ మొదట తనకే రావాల్సిందని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ తననే అనుకున్నారని, కానీ ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకే ఆ క్యారెక్టర్ దక్కుతుందని అన్నారు. సునీల్ ఆ రోల్‌లో అద్భుతంగా నటించాడని శివాజీ మెచ్చుకున్నారు.

More in Entertainment