సరస్వతి కాలువకు నీటి విడుదల

TG: నిర్మల్ జిల్లా సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు.