నిబంధనలు ఉల్లంఘన.. కేసు నమోదు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడులో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజే వినియోగించడంతో పోలీసులు డీజేను సీజ్ చేశారు. డీజే నిలిపివేయాలని సూచించినా కొందరు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై బీఎన్ఎస్, ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.



