← Back to news

నల్లబెల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

By Ramesh Ch· 1d ago· Nallabelly, Nallabelli, Warangal
నల్లబెల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నాగెల్లి జ్యోతి–ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

More in Local