తిమ్మాపూర్‌లో చాకలి ఐలమ్మ జయంతి

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, బహుజన మహిళల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



