← Back to news

మద్యం తాగొద్దన్న భార్య.. మురికి కాలువలోకి దూకి భర్త ఆత్మహత్య

By Vishi· 1h ago

నోయిడాలోని సెక్టార్-81 మెట్రో స్టేషన్ సమీపంలో దారుణ ఘటన జరిగింది. UPలోని ఎటా జిల్లాకు చెందిన 29 ఏళ్ల రవి అనే యువకుడు తన భార్యతో కలిసి నోయిడాలో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం మద్యం తాగే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో రవి తన భార్య చూస్తుండగానే సెక్టార్-81 మెట్రో స్టేషన్ దగ్గరున్న మురికి కాలువలోకి దూకేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, NDRF, SDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం రవి మృతదేహాన్ని బయటకు తీశారు.

More in National