ఆగ్రాలో వృద్ధ దంపతుల ఆవేదన
UPలోని ఆగ్రాకు చెందిన రామ్ బిలాస్ కటారా, ఆయన భార్య ఉషా కటారా తమ కొడుకు, కోడలు 2022 జనవరి 4న ఇంటి నుంచి బయటకు పంపించారని ఓ వీడియోలో ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి 75 లక్షలు ఖర్చు చేశామని, తర్వాత దాన్ని 46 లక్షలకు అమ్మేశారని చెప్పారు. 2022 నుంచి వీడియోల ద్వారా న్యాయం కోరుతున్నామని తెలిపారు. ఆగ్రా పోలీసులు ఇది ఆస్తి హక్కు, వాటా వివాదమని చెప్పారన్నారు. ఇల్లు కోడలి పేరుతో ఉందని, ఆస్తి పంచుకోవడంపై కేసు కోర్టులో ఉందని తెలిపారన్నారు.


