నిమజ్జనోత్సవాలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, రీల్స్, సెల్ఫీల కోసం ప్రమాదకరంగా వ్యవహరించవద్దని సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.


