కృత్రిమ కొలనులో గణేష్ నిమజ్జనం.. ఘనంగా!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కృత్రిమ కొలను రెడీ చేశారు. తొమ్మిదో రోజు వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ముఖ్య అతిథిగా వచ్చారు. కమిషనర్ గిరీష్ ఆధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు జరిగాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.


