ఓట్లు తొలగించే ప్రయత్నం.. BJP ఏజెంట్ పై కేసు

కర్ణాటకలోని బళ్లారిలో 7,561 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు ట్రై చేసిన BJP అనుబంధ BLA టీ. శ్రీనివాస్ మోత్కూర్‌పై పోలీసులు FIR నమోదు చేశారు. ఓటర్లు లేరని, వేరే ప్రాంతాలకు మారారని చెప్పి ఫారం-7 అప్లికేషన్స్ ఇచ్చాడు. అయితే ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు అప్లికేషన్స్ ను తిరస్కరించమనీ అధికారులు తెలిపారు. ఇదే టైంలో విజయపురలో డూప్లికేట్ డెత్ సర్టిఫికేట్లతో ఓటర్ల పేర్లు తొలగించేందుకు ప్రయత్నించారన్న కంప్లయింట్ లపై విచారణకు ఆదేశించారు.


