పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి!
పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్లోని ముల్తాన్ జిల్లాలో షేర్ షా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు రెహ్మాన్ బాబా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న రైలులోని కోచ్లు పట్టాలు తప్పడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.



