నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్

TG: రోగులకు వేగంగా వైద్య సహాయం అందించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితులు, ఇతర వైద్య సేవల కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రోగుల వివరాలను వాట్సాప్ ద్వారా పంపిన తర్వాత ఫోన్‌లో చెప్పాలని అధికారులు సూచించారు. రోగుల సేవల కోసం 4 అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్లను, వారి సమన్వయానికి అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌ను నియమించారు. నిమ్స్ హెల్ప్‌లైన్ 040-23489692. డ్యూటీ RMO నంబర్ 9490296073.

