‘ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశం!

‘ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై తెలంగాణ హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది. సెప్టెంబర్ 20న ఇచ్చిన మెమోను పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ధరల పెంపునకు కారణాలను మెమోలో చెప్పలేదని కోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుండగా.. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు 500 రుపాయల టికెట్‌తో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. ఈ కేసుపై తర్వాతి విచారణ అక్టోబర్ 6న జరగనుంది.


