El Nino ముప్పు.. తాగునీటిపై అలర్ట్

TG: రాబోయే రోజుల్లో El Niño ఎఫెక్ట్‌తో తాగునీటి కొరత వచ్చే అవకాశం ఉండటంతో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రిజర్వాయర్ల నీటిని ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని, సింగూర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో నిజాంసాగర్ నుంచి నీటిని తరలించాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో ఆల్టర్నేటివ్ నీటి సౌకర్యాలను గుర్తించాలని తెలిపారు.

