← Back to news

వాజేడులో మిర్చి రైతుల ఆందోళన

By Bala· 1d ago
వాజేడులో మిర్చి రైతుల ఆందోళన

ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి ఉద్ధృతి పెరగడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన ఉన్న సమ్మక్క-సారక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల పెరగడంతో చండ్రుపట్ల, ధర్మారం, వాజేడు ప్రాంతాల్లో సుమారు 60 ఎకరాల మిర్చి తోటలు నీట మునిగాయి. పంట దెబ్బతినడంతో రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

More in Local