మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కృషి: మంత్రి మండిపల్లి

AP: రాష్ట్ర అభివృద్ధి, యువత సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని షేక్ కన్వెన్షన్ హాల్‌లో మహానాడు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి మరింత వేగంగా పనిచేస్తామన్నారు.



