రాజ్యాధికార సమర భేరిని విజయవంతం చేయాలి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం కాకజ్జాల గ్రామంలో BSP నాయకులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. BSP వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘బహుజన రాజ్యాధికార సమర భేరి’ సభకు గ్రామస్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సభకు సంబంధించిన వివరాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల BSP నాయకులతో పాటు నవాబుపేట మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.



