కల్లూరు నుంచి కల్తీ కల్లు సరఫరా?

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు నుంచి నర్సాపూర్ జి మండలానికి సరఫరా అవుతున్న కల్తీ కల్లును అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ₹10గా ఉన్న సీసా ధరను ₹15కు పెంచడంతో పాటు, ప్లాస్టిక్ ప్యాకెట్ల నుంచి తెల్లటి రసాయన పదార్థం బయటకు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ కల్లుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.





