పేదరికాన్ని జయించి MBBS సీటు సాధించిన యువకుడు

సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామానికి చెందిన సూతే ఏలియన్ పేదరికాన్ని జయించి MBBS సీటు సాధించడం అభినందనీయమని BSP నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం అన్నారు. అంబేద్కర్ భవనంలో ఏలియన్‌ను శాలువాతో సన్మానించారు. చదువుకోవడానికి పేదరికం అడ్డుకారాదని, ఏలియన్ డాక్టర్ చదువు పూర్తి చేయడానికి స్థానిక MLAతో పాటు దాతలు, మేధావులు ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలని ఆయన కోరారు.


