← Back to news

ఫ్రెండ్ షిప్ కి నో చెప్పిందని.. ఓ పూజారి వికృత చేష్టలు !

By DS· 28 May 2026· Ndtv· Delhi
 ఫ్రెండ్ షిప్ కి  నో చెప్పిందని..   ఓ పూజారి వికృత చేష్టలు !

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి తన స్నేహాన్ని తిరస్కరించిందనే కోపంతో, ఢిల్లీకి చెందిన సుమిత్ నెంచంద్ శర్మ అనే పూజారి ఘాతుకానికి ఒడిగట్టాడు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ ఉపయోగించి ఆ యువతి, ఆమె తల్లికి సంబంధించిన అసభ్యకర మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి, నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేశాడు. గుజరాత్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 'మిషన్ సైబర్ రక్షిక' కింద నిందితుడిని ఢిల్లీలో ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో మతపరమైన ప్రసంగాలు చేసే ఈ పూజారి వికృత చేష్టలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

More in Politics