ఏపీలో రైలు ఢీకొని నలుగురు మృతి

AP: శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి.. రావివలసలో రైలు ప్రమాదం జరిగింది. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు చనిపోయినట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల రైలు ప్రయాణాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేశారు.

