బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ప్రజావెలుగు పార్టీ మద్దతు

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగనున్న దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు తెలంగాణలో ప్రజా వెలుగు పార్టీ మద్దతు ప్రకటించింది. సమ్మెకు మద్దతు తెలిపిన తొలి రాజకీయ పార్టీ తమదేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు.



