భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీకి అడ్డంకులు: ఎలాన్ మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించకుండా కొందరు వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. వారు తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ కంపెనీ రెఢీగా ఉందని తెలిపింది. ఇప్పటికే 20 గేట్‌వే సెంటర్స్ ఏర్పాటు చేసి, భారతీయుల డేటా దేశంలోనే ఉండేలా భద్రతా వ్యవస్థలను సిద్ధం చేసింది. అవసరమైన ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తామని స్టార్‌లింక్ తెలిపింది.



