రైతుల పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది: డీకే అరుణ
మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ఆయకట్టు రైతుల ఆందోళన, బీజేపీ పోరాటంతో ప్రభుత్వం సాగునీటి విడుదలకు చర్యలు చేపట్టిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. జూరాలలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలకు నీరు విడుదల చేయకపోవడం సరికాదన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ నెల 19న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.


