← Back to news

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

By DK· 2d ago
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

AP: పలాస నియోజకవర్గానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.19,62,767 విలువైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

More in Local