← Back to news

అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తనిఖీలు

By Bala· 2h ago
అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తనిఖీలు

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 8వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం మున్సిపల్ ఛైర్పర్సన్ కాపా చంద్రకళ తనిఖీ చేశారు. పిల్లలకు అందుతున్న పోషకాహారం, మెనూ అమలు, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి పిల్లల సంఖ్యను తెలుసుకున్నారు. పిల్లలు యూనిఫాం ధరించేలా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

More in Local