← Back to news

మాంసాహారం వల్ల ఈ ఊరు వినాయక చవితికి దూరం

By Jagadish· 18h ago
మాంసాహారం వల్ల ఈ ఊరు వినాయక చవితికి దూరం

అనంతపురం జిల్లా శేట్టూరు మండలం బసంపల్లిలో విచిత్రం ఆచారం కొనసాగుతోంది. మిగతా వాళ్లంతా వినాయక చవితి పండుగ జరుపుకునే టైంలో ఈ గ్రామం మదేవత మారెమ్మ ఉత్సవాలు జరుపుతుంది. మారెమ్మ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏటా వినాయక చవితికి ఒకటి, రెండు రోజులు ముందే ఈ ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామస్థులు బంధుమిత్రులతో కలిసి మాంసాహారం వండుకుంటారు. కాబట్టి గణపతి పూజ చెయ్యడం అపవిత్రం అని భావిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో బసంపల్లి గ్రామం వినాయక చవితికి దూరంగా ఉంటుంది. మీ ఊర్లో ఇలాంటి విశేషాలుంటే Clearcut Newsకి పంపండి.

More in Local