డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

నిజామాబాద్ జిల్లాలోని డిగ్రీ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు మరో ఛాన్స్ ఇచ్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో మళ్ళీ స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. అన్ని రకాల గవర్నమెంట్, ప్రైవేట్, యూనివర్సిటీ కాలేజీల్లో 'దోస్త్' (DOST) ద్వారా ఈ అడ్మిషన్లు ఇస్తారు. స్టూడెంట్స్ వెంటనే అప్లై చేసుకుని డిగ్రీ సీటు సాధించుకోవచ్చని అధికారులు చెప్పారు.



