ఉద్యోగి మృతి.. భగ్గుమన్న ఫతేనగర్
TG: హైదరాబాద్.. బాలానగర్ దగ్గరలోని ఫతేనగర్‌లో తీవ్ర కలకలం రేగింది. జలమండలి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయి కిరణ్ ముదిరాజ్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందడంతో తోటి ఉద్యోగులు నిరసనకు దిగారు. జీతాల పెంపు కోసం ఆందోళనలో పాల్గొని వచ్చిన తర్వాతే కిరణ్ చనిపోయాడని వారు అన్నారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐతే.. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.



