ఇటుకల వెనుక జనం.. గన్స్‌తో కాల్పులు
UPలోని మథుర జిల్లా బజ్నా గ్రామంలో ప్లాట్ బౌండరీ కడుతుండగా గొడవ జరిగింది. దీపక్ గౌతమ్ అనే వ్యక్తి కంప్లైంట్ ప్రకారం..కొందరు గన్స్‌తో అక్కడికి వచ్చి పని ఆపాలని బెదిరించారని ₹20 లక్షలు ఇవ్వాలని అడిగి, కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.కాల్పులు జరిపిన వీడియోలు SMలో వైరల్ గా మారాయి. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇటుకల వెనుక దాక్కున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై ఏడుగురిపై కేసు పెట్టిన పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.