మలేరియా మందులపై సుప్రీం ఫోకస్

AP: పోలవరం ఏజెన్సీలో మలేరియా రాకుండా గ్రామస్తులకు ఇచ్చిన మందులు వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురై ఓ గిరిజన చిన్నారి మృతి చెందింది. మరి కొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తనంతట తానే కేసుగా తీసుకుని విచారించింది. అక్టోబర్ 5న విచారణలో.. ఈ విషయంపై జరుగుతున్న విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గమనించాలని చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించింది.


