సూర్యలంకకు బెస్ట్ బీచ్ అవార్డ్స్

బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌కు రాష్ట్రస్థాయి ‘బెస్ట్ బీచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అవార్డు లభించింది. రాజమండ్రిలో నిర్వహించిన టూరిజం ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. బీచ్‌ను అభివృద్ధి చేయడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానికులు, స్విమ్మర్లను కలెక్టర్ వినోద్‌కుమార్ అభినందించారు. సూర్యలంకను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.



