‘ఖైరతాబాద్’.. ఆ పేరు ఎలా వచ్చింది?

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతం ఖైరతాబాద్. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఒక స్థలం బహుమతిగా ఇచ్చారు. అదే ఇప్పటి ‘ఖైరతాబాద్’. ఆమె అల్లుడు హుస్సేన్ షా వలీ హుస్సేన్ సాగర్ ట్యాంక్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. కుతుబ్ షాహీ కాలంలో ఖైరున్నీసా అనే పేరుతో ఇద్దరు యువరాణులు ఉన్నారు. ఒకరు ఇబ్రహీం కుమార్తె. మరొకరు తర్వాతి రాజు ముహమ్మద్ కుతుబ్ షా కుమార్తె. ఈ ప్రాంతం పేరు కుతుబ్ షా కుమార్తె పేరు నుంచే వచ్చింది.

