CM రేవంత్ రెడ్డికి అవమానం?
TG: హైదరాబాద్.. హైటెక్స్లో ఇవాళ CM రేవంత్ రెడ్డికి ఊహించని షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచే ఎదురైంది. గ్లోబల్ బిజినెస్ మీట్-2026లో చీఫ్ గెస్టుగా పాల్గొన్న CM ప్రసంగించబోతుంటే.. ప్రభుత్వ సలహాదారు V హనుమంతరావు అడ్డుకున్నారు. "నేను మాట్లాడొద్దా" అని అనడంతో.. సీఎం వెంటనే ప్రసంగం ఆపారు. తిరిగి తన కుర్చీలో కూర్చున్నారు. ఇది CMకి అవమానం అని కొందరు అంటుంటే.. పెద్దల పట్ల CM గౌరవం చూపించారని మరికొందరు అంటున్నారు.



