UNలో పాక్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

UNGA సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్థాన్‌కి కౌంటర్ ఇచ్చారు. పాక్‌ను ఉద్దేశిస్తూ ‘ఉగ్రవాదంలో ఆరితేరిన దేశం’ అని విమర్శించారు. టెర్రరిజానికి సపోర్ట్ చేసే ప్రభుత్వాలను, జరిగే నష్టాలకు బాధ్యులుగా చేయాలని అన్నారు. ఉగ్రవాదంపై భారత్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ UNలో ప్రసంగించిన నెక్ట్స్ డే జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


