వరి వద్దే వద్దు: పొంగులేటి

TG: రాష్ట్రంలో El Nino ప్రభావంతో సాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రబీలో వరి సాగు చేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన సభలో రైతులకు సూచించారు. నీరు అందక పంట ఎండిపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే ఖరీఫ్ వరి పంటను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. El Ninoతో విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు.


