Regularisationకు.. మరో ఛాన్స్

AP: రాష్ట్రంలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అప్లికేషన్స్ పరిశీలన, సబ్మిషన్ డేట్ను ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ‘నిధి’ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగనుంది. సాంకేతిక, పరిపాలనా సమస్యలతో గత గడువులో ప్రక్రియ పూర్తి కాలేదని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పొడిగింపు సెకండరీ హెల్త్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. అర్హుల దరఖాస్తులను డిసెంబర్ 31లోగా సబ్మిట్ చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి వాడ్రేవు వినయ్ చంద్ తెలిపారు.


