నా కొడుకు చేసిన తప్పేంటి? అభిజీత్ దీప్కే తల్లి ప్రశ్న

ఢిల్లీలో CJP నిరసనకు వెళ్తున్న అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే డిటైన్ చేశారు. ఈ విషయం తెలిసి తన తల్లి అనిత దీప్కే స్పందించారు. ఆ రోజు టీవీ చూడొద్దని, ఫోన్ చెక్ చేయొద్దని కొడుకు చెప్పాడని, కానీ అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో చూసి విషయం తెలిసిందని చెప్పారు. అసలు తన కొడుకు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. నిరసనకు వెళ్తున్న వ్యక్తిని విమానంలోనే అదుపులోకి తీసుకోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

