వందలాది జంతర్ మంతర్లు పుడతాయి: కిశోర్
ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ, RSSలను ఉద్దేశించి నటుడు కిశోర్ వీడియో రిలీజ్ చేశారు. జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసనను అనుమతించి ఉంటే ఇదంతా ఈజీగా అయ్యేదని, అలా చేయకుండా గృహ నిర్బంధాలు, బెదిరింపులు, లాఠీలు, తుపాకులు, రైళ్ల రద్దులు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చేయడం ద్వారా ఓటు చోరీ జరిగిందని మీరే అంగీకరించినట్లు అవుతోందన్నారు. జంతర్ మంతర్‌లో నిరసనను నిరోధిస్తే ప్రతి రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ ఆఫీసుల వద్ద వందలాది జంతర్ మంతర్లు పుడతాయన్నారు.


