ఢిల్లీలో మమతా బెనర్జీ, TMC MPలు డిటైన్!
ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన చేస్తున్న మమతా బెనర్జీని పోలీసులు డిటైన్ చేశారు. తాము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నా, కూర్చోవడానికి కూడా అనుమతించలేదని ఫైర్ అయ్యారు. ‘మేం భయపడం.. ఈ పోరాటం కొనసాగుతుంది’ అని ఆమె అన్నారు. మరోవైపు, తనతో పాటు TMC MPలు డెరెక్ ఓబ్రెయిన్, దోలా సేన్ సహా ఐదుగురిని పోలీసులు ప్రిజనర్ వ్యాన్‌లో గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది డెమోక్రటిక్ రైట్స్‌పై దాడి అని మమతా విమర్శించారు.


