22 ఏళ్ల నాటి పోస్ట్‌కార్డు... ఎన్నో జ్ఞాపకాలు!

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ గ్రామంలో 22 ఏళ్ల క్రితం రాసిన ఓ పాత పోస్ట్‌కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది. డిజిటల్ యుగంలో చేతిరాత ఉత్తరాల సంస్కృతి కనుమరుగవుతున్న వేళ, బెల్లంపల్లి APR స్కూల్‌కు చెందిన T. సతీష్ కుమార్ 2004 డిసెంబర్ 13న తన మిత్రుడు జబీర్‌కు రాసిన ఈ లేఖ నాటి స్నేహబంధాన్ని గుర్తుచేస్తోంది. ఇవాళ World Post Day (ప్రపంచ తపాలా దినోత్సవం) సందర్భంగా ఈ లేఖ పోస్టల్ సేవల ప్రాధాన్యాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు.
