మంగళగిరిలో గణపతి శోభాయాత్రలు
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శనివారం వైభవంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.. విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జన ప్రాంతాలకు తరలించారు. గణభజనలు, డప్పుల మోత, నృత్యాలు, భక్తుల జయజయధ్వానాలతో ప్రధాన వీధుల్లో సందడి నెలకొంది. యువత ఉత్సాహంగా డ్యాన్సులు చేయగా, శోభాయాత్రలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.



