ఫేక్ స్మశానం

స్పెయిన్‌లో 1966 'ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ' అనే హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం 5,000 నకిలీ సమాధులతో ఒక ఆర్టిఫిషియల్ స్మశాన వాటికను కట్టారు. అదే ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ స్మశానంగా పేరు పొందింది. షూటింగ్ ముగిసినా దాన్ని తీసేయకుండా అలాగే ఉంచడంతో, మొక్కలు పెరిగి పాడైపోగా, 2015లో కొంతమంది సినిమా అభిమానులు దీన్ని మళ్లీ బాగు చేశారు. ఆ సమయంలో ఫండ్స్ కోసం 15 యూరోలు డొనేషన్ ఇచ్చిన ప్రతిఒక్కరి పేరును అక్కడి ఒక శిలువపై రాశారు. ప్రస్తుతం ఈ ఫేక్ స్మశానం ఒక పాపులర్ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది.




