గణేష్ నిమజ్జనం శాంతియుతం: అదనపు డిసిపి

సికింద్రాబాద్ జోన్‌లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అదనపు డిసిపి జె. నర్సయ్య శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లతో నిమజ్జనం విజయవంతమైంది. హుస్సేన్ సాగర్‌లో వేలాది విగ్రహాలు నిమజ్జనం చేశారు. నిర్వాహకులు, కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, బస్తీ ప్రజలకు ధన్యవాదాలు. సీపీ సజ్జనార్, డిసిపి రక్షిత కృష్ణమూర్తి మార్గదర్శనంలో ప్రశాంతంగా జరిగింది. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేశాయి.



